ది గ్రేట్ ఖలీకి కోపమొచ్చింది..విదేశీ రెజ్లర్లను ఉతికిపారేశాడు.. ఎందుకో తెలుసా?

బుధవారం, 12 అక్టోబరు 2016 (18:34 IST)
ప్రత్యర్థులకు చుక్కలు చూపించే.. ది గ్రేట్ ఖలీ రెజ్లర్ దిలీప్ సింగ్ రానాకు కోపమొచ్చింది. అయితే ఈసారి కోపం వచ్చింది కుస్తీల రింగ్‌లో కాదు. విదేశీ రెజ్లర్లపై. వివరాల్లోకి వెళితే.. జలంధర్‌‍లోని ఇతని రెజ్లింగ్ అకాడమీపై కొందరు విదేశీ రెజ్లర్లు దాడి చేసి అక్కడి సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. కొన్ని డాక్యుమెంట్లను చించివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఖలీ కోపంతో ఊగిపోయాడు. అంతే వారు బస చేసిన హోటళ్లోకి వెళ్లి వారిని చితకబాదాడు. 
 
దీనిపై ట్రిబ్యూన్ పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురిస్తూ దీని వెనుక జరిగిన ఉదంతాన్ని ప్రస్తావించింది. గుర్‌గావ్‌లో ఓ రెజ్లింగ్ పోటీని వాయిదా వేయడంతో  విదేశీ రెజర్లు అసంతృప్తితో ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ రాకతో పాటు ఈ పోటీలు కూడా అదే రోజున జరగాల్సి వుంది. 
 
కానీ పోలీసుల భద్రత ఉండదనే కారణంతో పోటీలను రద్దు చేసుకున్నామని.. కానీ ఇందుకు తాను కారణమని విదేశీ రెజ్లర్లు అకాడమీలో బీభత్సం సృష్టించారని ఖలీ చెప్పుకొచ్చాడు. దీనిపై పోలీసులకు చెప్పకుండానే తానే డీల్ చేసుకున్నానని ఖలీ చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి