జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోం.. రెజ్లర్ బజరంగ్ పూనియా

బుధవారం, 7 జూన్ 2023 (19:41 IST)
ఢిల్లీలో రెజ్లర్ల నిరసన తాత్కాలికంగా ఉపసంహరించబడింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెజ్లర్ల వ్యవహారాన్ని జూన్ 15 నాటికి పోలీసుల విచారణ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని తాము పట్టుబట్టామని చెప్పాడు. 
 
అందుకు మంత్రి అంగీకరించినట్లు బజరంగ్ పూనియా వెల్లడించాడు. లైంగిక ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను విచారిస్తున్నారు. 
 
బ్రిజ్ భూషణ్‌పై విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుంది. జూన్ 15లోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోమని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు