న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్ల నిరసన మూడో రోజుకు చేరుకుంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా, ఇతర రెజ్లర్లు శుక్రవారం ఉదయం 11.45 గంటలకు జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. గత రాత్రి గురువారం వారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిశారు.
ప్రభుత్వం వెంటనే ఫెడరేషన్‌ను రద్దు చేయాలన్న తమ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గకపోవడంతో రెజ్లర్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అలాగే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెప్తున్నారు. టోర్నీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ఎవరైనా బస చేస్తారని పేర్కొన్నారు.