అశ్వవాహనంపై ఊరేగిన శ్రీవారు

శనివారం, 20 అక్టోబరు 2007 (10:33 IST)
తిరుపతి తిరుమల దేవస్థానంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగారు. కలియుగంలో తలెత్తె దుష్పరిణామాలను ప్రజల నుంచి దూరం చేసేందుకు కంకణం దాల్చిన రీతిలో అశ్వవాహన రూఢుడై మాడవీధులలో తిరుగాడిన శ్రీనివాసుడు, భక్తులకు నయనాందకరం గావించి మోక్షమార్గాన్ని చూపాడు.

అశ్వవాహనంతో మలయప్పస్వామికి వాహన సేవలు ముగిసిపోయాయి. శనివారం ఉదయం అనగా బ్రహ్మోత్సవాలకు చివరిరోజున స్వామికి పల్లకి సేవ, అనంతరం స్వామివారి చక్రస్నాన మహోత్సవం జరిగింది. వేల సంఖ్యలో చక్రస్నాన సేవను చూసేందుకు హాజరైన భక్తుల గోవిందనామస్మరణతో తిరుమల వీధుల్లో ఆధ్యాత్మిక కాంతులు వెల్లివిరిసాయి.

వెబ్దునియా పై చదవండి