చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

శుక్రవారం, 19 అక్టోబరు 2007 (10:45 IST)
తిరుపతి తిరుమల దేవస్థానంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి నవనీతచోరుని అవతారంలో స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. చంద్రుడు మనస్సు నుంచి శ్రీవారు ఉద్భవించినట్లు పురాణాలు చెబుతుండటంతో ఇప్పటి వరకు పశుపక్ష్యాదులను వాహనాలుగా మలచుకుని ఊరేగిన మలయప్ప స్వామి... గురువారం సూర్య, చంద్రులను వాహనాలుగా మలచుకుని దేవాలయ మాడవీధుల్లో ఊరేగారు.

గురువారం ఉదయం శ్రీవారు సూర్యప్రభవాహనంపై ఊరేగారు. సూర్యప్రభ, చంద్రప్రభ వాహనంపై గోవిందస్వామి ఊరేగిన తీరు భక్తులను కనువిందు చేసింది. సూర్య, చంద్రప్రభ వాహనాలపై తేజో విరాజిత మూర్తియై భక్తులకు అభయ ప్రదానం చేశారు.

ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం స్వర్ణరథోత్సవం, రాత్రి 9.00 గంటల నుంచి 10.30 గంటల వరకు వాహన సేవల్లో చివరి సేవగా పరిగణించే అశ్వవాహనసేవ జరుగనుంది.

వెబ్దునియా పై చదవండి