నయనానందకరం... తిరుమలేశుని గరుడసేవ

గరుడ వాహనంపై వేంచేసిన శ్రీనివాసుడు బుధవారం అశేష భక్త జన వాహినికి భక్తి భావనలను పెంపొందింపచేసాడు. బుధవారం రాత్రి 9 గం.నుంచి 11 గం. వరకు తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో సాగిన శ్రీవారి ఊరేగింపును వీక్షించేందుకుగాను ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలలోకి భక్తులు అశేష సంఖ్యలో విచ్చేసారు.

గరుడ వాహనంపై విచ్చేస్తున్న సప్తగిరివాసుని కాంచగానే భక్తులు చేసిన గోవిందనామ స్మరణ తిరుమలలో ప్రతిధ్వనించింది. బ్రహ్మోత్సవాలలో గరుడవాహన సేవకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. గరుడ వాహన సేవను తిలకించినంతనే పుణ్యఫలం ప్రాప్తిస్తుందన్నది భక్త జన విశ్వాసం.

అందుకు అనుగణంగా గరుడసేవ నాటికి తిరుమలకు భక్తుల తాకిడి ఆకాశాన్ని అంటింది. ఇక గురువారం నాటి బ్రహ్మోత్సవాలలో ఉదయం 9 గం.నుంచి 11 గం. వరకు శ్రీవారి హనుమంత సేవ, సాయంత్రం ఐదు గం.కు స్వర్ణ రథోత్సవం మరియు రాత్రి 9 గం. నుంచి 11 గం. వరకు గజవాహనసేవలు జరుగునున్నాయి.

వెబ్దునియా పై చదవండి