నవరాత్రి బ్రహ్మోత్సవాలు: నేడు అంకురార్పణ

గురువారం, 11 అక్టోబరు 2007 (12:53 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ (శుక్రవారం) ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు (గురువారం) సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం (10వ తేదీ) శ్రీ వేంకటేశ్వర స్వామి వారు బంగారు తిరుచ్చి వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊంజల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఇక గురువారం రాత్రి నిర్వహించనున్న అంకురార్పణలో భాగంగా సేనాధిపతివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు సంబంధించిన శాస్త్రోక్త కార్యక్రమాలను ఋత్విక్కులు నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి శ్రీవారు పెద్దశేష వాహనంలో ఊరేగుతారు.

ఇదిలా ఉండగా శ్రీవారికి విరాళంగా ఇచ్చే ఆస్తులకు ప్రభుత్వం స్టాంపు డ్యూటీని మినహాయించింది. ఈ మేరకు 643 జీవోను జారీ చేసిన ప్రభుత్వం తొలిసారిగా తిరుపతి ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ తమ పూర్వీకులకు చెందిన 2.70 ఎకరాల భూమిని తితిదేకు బుధవారం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి