ముత్యపు పందిరి వాహనంపై ఊరేగిన మలయప్ప

సోమవారం, 15 అక్టోబరు 2007 (10:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సావాల్లో మూడవ రోజైన ఆదివారం ముత్యపు పందిరి వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత, సర్వాలంకార భూషితుడైన శ్రీవారు ముత్యపు పందిరిలో ఊరేగిన వైనం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.

చంద్రునికి ప్రీతి పాత్రములైన అమూల్యమైన ముత్యాలతో అలంకరించబడిన ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు ఆశీనులైన తీరు భక్తులను కనువిందు చేసింది. మానవ మాత్రునికి గల అహంకారాన్ని అణచివేసి తమను శరణాగతి చెందాలనే బోధనను తెలుపుతూ... శ్రీవారు దేవాలయ మాడవీధుల్లో ఊరేగిన భక్తులకు అభయ ప్రదానం చేశారు.

నవరాత్రి ఉత్సవాల్లో నాలుగోరోజైన సోమవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహన సేవ, రాత్రి సర్వభూపాల వాహన సేవలు జరుగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి