వైభవంగా శ్రీవారి చక్రస్నానం

ఆదివారం, 21 అక్టోబరు 2007 (12:03 IST)
తిరుపతి తిరుమల దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం చక్రస్నానంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున నిర్వహించే అవబధస్నాన్నే చక్రస్నానంగా నిర్వహిస్తారు.

శ్రీవారి ఉత్సవరులైన మలయప్పస్వామి, శ్రీదేవీ, భూదేవీ సమేతంగా వరహస్వామి ఆలయం వద్ద వేంచేస్తుండగా... అర్చకులు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

అనంతరం చక్రత్తాళ్వార్‌ను పుష్కరిణిలో ముంచడంతో చక్రస్నాన కార్యక్రమం వేడుకగా పూర్తయ్యింది. చక్రస్నానానికి అనంతరం ఆ పుణ్యతీర్థంలో స్నానమాచరిస్తే సర్వదోషాలు తొలగి పోతాయని ప్రతీతి. చక్రస్నానానికి అనంతరం వేలకొలది మంది భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించారు. అనంతరం ఊరేగింపుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయం చేరుకున్నారు.

వెబ్దునియా పై చదవండి