కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి

FileFILE
శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణపరమాత్ముడు జన్మించిన శుభదినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి
ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది. ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య
ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమం పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి