గ్రాఫిక్స్‌లో వాల్మీకీ రామాయణం

భారతదేశం వివిధ కళలకు నిలయం. ఇక్కడ రూపొందిన అపురూప చిత్రాల గురించి చెప్పాలంటే చర్విత చర్వణమే అవుతుంది. మహాకావ్యాలైన మహా భారతం, వాల్మీకి రామాయణంలోని అనేక ఘట్టాలను చిత్రకారులు తమ కుంచెలతో అద్భుత రీతిన చిత్రించి తమ తదుపరి తరాలకు అందించి తరించారు.

ఇటీవలకాలంలో ఆ మహా కావ్యాలలోని మహా పురుషుల జీవితాన్ని యానిమేషన్ చిత్రాలుగా మలిచి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బాల హనుమాన్, భీమ, ఘటోత్కచ వంటివి నిర్మితమయ్యాయి.

ఇలా యానిమేషన్ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించటం ఒక ఎత్తైతే... వారి జీవితాన్ని గ్రాఫిక్స్ డిజైన్లలో రూపొందించి అద్భుత రీతిన ప్రజలకు అందజేయటం మరో ఎత్తు. రామాయణంలోని సంఘటలను మొత్తం 108 చిత్రాలలో కళ్లకు కట్టినట్లు రూపొందించి వీక్షకుల మన్ననలు పొందుతున్నారు హైదరాబాదులోని కొల్లూరి అనే కళాకారుడు. ఆయన రూపొందించిన చిత్రాలను వీడియోలో వీక్షించండి...

వెబ్దునియా పై చదవండి