శ్రీరామనవమి రోజున జరిగే ఉత్సవాలు..?

శనివారం, 13 ఏప్రియల్ 2019 (15:32 IST)
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుంగలో జన్మించారు. స్వామివారి మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాములవారు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనారు. 
 
ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్థ నవమి రోజునే జరిగినదని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్మాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి రోజున తెలంగాణలో గల భద్రాచలం నందున సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళల్లో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊగేరిస్తారు. చైత్ర నవతాత్రి లేదా వసంతోత్సవం‌తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. 
 
శ్రీరామనవమి రోజున జరిగే ఉత్సవంలో విశేషాలు:
1. ఆలయ పండితులనే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. 
2. బెల్లం, మిరియాలు కలిపి తయారుచేసిన పానకం కూడా ఇస్తారు. 
3. ఉత్సవ మూర్తుల ఊరేగింపు, రంగు నీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
4. ఈ రోజున హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు.. లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు. 
5. ఆలయాలను రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణును, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు