అలా అవతరించేందుకు చంద్రుడు దేవతలకు ఒక షరతు పెట్టాడు. నా అంశతో జన్మించిన ఇతడు పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించగలడు... అన్నాడు. అతని కుమారుడు ఉత్తరాగర్భంలో జన్మించి వంశోద్ధారకుడవుతాడన్నాడు. అలాగే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించాడు. సైంధవుడు అడ్డుపడటం వల్ల భీమాదులు లోపలికి ప్రవేశించలేకపోయారు. దైవవిధి వక్రించి అభిమన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణుడు అతనిని బ్రతికించే ప్రసక్తి రాదు.