భగవంతుడు ఆశించేది ధర్మ, న్యాయాలతో జీవీతాన్ని గడపమని. మ్రొక్కులు తీసుకుని మన పాపాలని ఆయన స్వీకరించడు. మ్రొక్కుబడులివ్వలేదని కష్టాలు పెట్టడు.ఎవరు చేసిన కర్మలని బట్టి వారు వారి వారి పాపపుణ్యాలను అనుభవించక తప్పదు. కష్టమొస్తే భగవంతునికి మొక్కుకుని, తీరిన తరువాత మరిచిపోయిన వారికి, మళ్లీ కష్టంలో ఆ మ్రొక్కు గుర్తుకు వచ్చి కుటుంబ సమేతంగా ఆ మ్రొక్కు తీర్చుకుంటారు.