కావలసిన పదార్థాలు : ఫైనాఫిల్ ముక్కలు.. 300 గ్రా. బెల్లం... వంద గ్రా. నెయ్యి... వంద గ్రా. కొబ్బరిపాలు... 600 గ్రా. శొంఠిపొడి... ఒక టీ. జీలకర్ర పొడి... ఒక టీ. జీడిపప్పు... 20 గ్రా. కిస్మిస్... 20 గ్రా.
తయారీ విధానం : ఫైనాఫిల్ ముక్కలను ఉడికించి గుజ్జుగా చేసుకోవాలి. దళసరి పాత్రలో బెల్లాన్ని కరిగించి అందులో అనాస గుజ్జును వేసి చిక్కబడేదాకా సన్నటి సెగపై ఉంచాలి. తర్వాత శొంఠి, జీరా పొడులను వేసి కలపాలి. చివరగా కొబ్బరిపాలను చేర్చి బాగా కలిపి దించేయాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను పాయసంపై అలంకరించి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి, తియ్యతియ్యని ఫైనాఫిల్ పాయసం రెడీ అయినట్లే...!