ఆహా.. "అరటిపండు బర్ఫీలు" ఎంత రుచో...!

FILE
కావలసిన పదార్థాలు :
పండిన అరటిపండ్లు... 12
కొబ్బరిపాలు... ఒకటిన్నర కప్పు
పంచదార... ఒక కప్పు
బ్రౌన్ షుగర్... ఒక కప్పు
ఉప్పు... కాస్తంత

తయారీ విధానం :
తొక్క తీసిన అరటిపండ్లను కొబ్బరిపాలతో కలిపి మిక్సీలో వేసుకుని మెత్తటి గుజ్జులాగా తయారు చేసుకోవాలి. ఈ పదార్థాన్ని పాన్‌లో వేసి సన్నటి సెగమీద గరిటెతో అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. ఈ పదార్థం చిక్కబడిన తరువాత పంచదారను, బ్రౌన్ షుగర్‌ను, ఉప్పును కలిపి బాగా గట్టిపడేదాకా కలుపుతూ ఉడికించాలి.

చివరగా ఈ పదార్థాన్ని నెయ్యిరాసిన పళ్లెంలో బోర్లించి సమంగా పరచి, చల్లారిన తరువాత కావాల్సిన సైజులో ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే అరటిపండుతో తయారైన బర్ఫీలు సిద్ధమైనట్లే...!

వెబ్దునియా పై చదవండి