కావలసిన పదార్థాలు : పొట్లకాయ... ఒకటి పచ్చికోవా... ముప్పావు కేజీ పంచదార... అర కేజీ పంచదార పొడి... అర కేజీ యాలకుల పొడి... అర టీ. చెర్రీపండ్లు... పదిహేను
తయారీ విధానం : పొట్లకాయను పై చెక్కుతీసి ఒకటిన్నర అంగుళాల పొడవు ముక్కలుగా,రింగులుగా కోయాలి. ముక్కల మధ్యలో ఉన్న గింజల్నీ మెత్తగా ఉండే తెల్ల పదార్థాన్నీ తీసేసి ప్రతీ ముక్క చుట్టూ ఫోర్క్‌తో రంధ్రాలు చేయాలి. ఓ గిన్నెలో పంచదార వేసి అరలీటరు నీళ్లు పోసి పొట్లకాయ ముక్కల్ని అందులో వేసి సన్నని మంటమీద పది నిమిషాలపాటు ఉడికించాలి.
తరువాత 2 గంటలు అలాగే ఉంచాలి. ఆపై ముక్కలను బయటకు తీసి ట్రేలో పెట్టాలి. పచ్చికోవాను తీసుకుని కొంచెం వేడిచేసి దించాలి. చల్లారాక అందులో పంచదారపొడి, యాలకులపొడి కూడా కలిపి పొట్లకాయ ముక్కల లోపల నింపి పైన చెర్రీపండ్లను అలంకరిస్తే కోవా పొట్లకాయ తయారైనట్లే...!!