కావలసిన పదార్థాలు : పెద్దపలుకులుగా ఉండే గోధుమరవ్వ... అర కేజీ నెయ్యి... పావు కేజీ బెల్లం... అర కేజీ నూనె లేదా నెయ్యి... వేయించేందుకు సరిపడా డ్రైఫ్రూట్స్... తగినన్ని ఉప్పు... చిటికెడు
తయారీ విధానం : గోధుమరవ్వలో పావుకిలో నెయ్యి పోసి ఉప్పు వేసి కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి నూనె లేదా నేతిలో వేయించి తీయాలి. తరువాత ఈ ఉండల్ని పొడిపొడి చేయాలి. ఇప్పుడు ఈ పొడిలో బెల్లం పొడి, కొద్దిగా నెయ్యి, డ్రైఫ్రూట్స్ వేసి కలిపితే చుర్మా సిద్ధం. దీన్ని ఇలాగే తినవచ్చు, లేదా చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుంటే చుర్మా లడ్డూలు రెడీ..!