డ్రైఫ్రూట్స్ పిన్నీ

FILE
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు... రెండు కప్పులు
పంచదార... రెండు కప్పులు
నెయ్యి... ఒక కప్పు
కోవా... ఒక కప్పు
డ్రైఫ్రూట్స్... ఒక కప్పు
జాజికాయ పొడి... చిటికెడు

తయారీ విధానం :
మినప్పప్పును ఒక గంటపాటు నానబెట్టి, తగినంత నీటితో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేడిచేసి మినప్పప్పు మిశ్రమాన్ని కలిపి అడుగంటకుండా వేయించాలి. ఈ మిశ్రమంలో నెయ్యి బాగా కలిసిన తరువాత కోవా, పంచదార, డ్రైఫ్రూట్స్ కలిపి సన్నటి మంటమీద మిశ్రమం దగ్గరయ్యేంతదాకా కలుపుతూ ఉండాలి.

చివర్లో జాజికాయ పొడి కలిపి స్టౌ మీది నుంచి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ట్రేలో సమానంగా పరచి కావలసిన సైజులో ముక్కలుగా చేసుకోవాలి. అవసరం అనుకునేవారు కాజు, బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకుంటే చూసేందుకు అందంగా ఉంటాయి. అంతే డ్రైఫ్రూట్స్ పిన్నీ రెడీ..! ఇవి వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి