కావలసిన పదార్థాలు : గోధుమపిండి... అర కేజీ బొంబాయి రవ్వ... వంద గ్రా. పంచదార... రెండు కప్పులు కొబ్బరి ముక్కలు... అర కప్పు వంటసోడా... అర టీ. ఎండుద్రాక్ష... రెండు టీ. నూనె లేదా నెయ్యి... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం : గోధుమపిండిలో బొంబాయిరవ్వ, పంచదార, వంటసోడా వేసి, తగినన్ని నీళ్లు పోసి పూరీపిండిలా కలపాలి. అందులోనే సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఎండుద్రాక్ష కూడా కలపాలి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి మందపాటి పూరీల్లా వత్తాలి. స్టవ్ మీద బాణలిపెట్టి నూనె లేదా నెయ్యి పోసి కాగాక పూరీల్ని వేయించి తీయాలి. ఆరిన తరువాత తింటే ఈ తీపి పూరీలు చాలా రుచిగా ఉంటాయి.