తీపితీపి చుట్టలతో "చనార్ జిలిపి"

FILE
కావలసిన పదార్థాలు :
పాలు... అర లీ.
మంచినీరు.. అర లీ.
పంచదార.. అర కేజీ
పనీర్.. 350 గ్రా.
గోధుమరవ్వ.. 75 గ్రా.
నెయ్యి.. 5 గ్రా.
వేయించేందుకు నెయ్యి.. సరిపడా

తయారీ విధానం :
తక్కువ మంటమీద పాలను మరిగిస్తూ, మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి. పాలలో నాలుగోవంతు మాత్రమే మిగిలేలా అంటే కోవాలా అయ్యేవరకూ మరిగించి, చల్లార్చి మెత్తగా మెదపాలి. పంచదారలో నీళ్లు కలిపి తక్కువ మంటమీద గులాబ్‌జామ్‌ పాకంలా లేతపాకం పట్టాలి. పనీర్‌, రవ్వ, ఉడికించిన కోవా, నెయ్యి అన్నీ వేసి కాస్త జారుగా జిలేబీ మిశ్రమంలా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కాస్త లావు రంధ్రం ఉన్న ఓ ప్లాస్టిక్‌ లేదా పాలకవర్‌లో వేసి కాచిన నెయ్యిలో జిలేబీ చుట్టలు మాదిరిగా చుట్టి వేయించి, పాకంలో వేస్తే అవే సరికొత్త చనార్ జిలిపీలు...!

వెబ్దునియా పై చదవండి