కావలసిన పదార్థాలు : సొరకాయ.. పెద్ద సైజుది పాలు.. రెండు లీ. బాస్మతి రైస్.. 200 గ్రా. కార్న్‌ఫ్లోర్.. 200 గ్రా. కోవా లేదా ఖలాకండ్.. అర కేజీ పంచదార.. ఒక కేజీ మిల్క్‌మెయిడ్.. 800 గ్రా. నెయ్యి.. 1000 గ్రా. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష.. 100 గ్రా. గ్రీన్ ఫుడ్‌కలర్.. అర టీ.
తయారీ విధానం : ముందుగా బాస్మతి బియ్యాన్ని చిటికెడు నేతిలో వేయించి, పిండి చేసుకుని పక్కనుంచాలి. ఒక పాత్రలో పాలు పోసి అవి మరుగుతుండగా, బియ్యంపిండిని నీటిలో కలిపి పేస్టులా చేసి గరిటెతో కలుపుతూ ఆ పాలల్లో పోయాలి. అలాగే మొక్కజొన్న పిండిని కూడా పేస్టులా చేసి అందులో పోయాలి. దాంతోపాటు సొరకాయ తురుమును కూడా కాస్త ఉడికించి ఆ తరువాత వేయాలి.
ఆపై చక్కెర వేసి చల్లారిన తరువాత కోవా, మిల్క్‌మెయిడ్, గ్రీన్ ఫుడ్ కలర్ వేసి బాగా కలియబెట్టాలి. చివరగా నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను అందులో వేయాలి. ఈ మిశ్రమం కాస్త చలబడిన తరువాత ఓ అరగంటపాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతే కద్దూ కీ ఖీర్ తయారైనట్లే..! ఇది వారం, పదిరోజులపాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తిన్నాకూడా చాలా మధురంగా, టేస్టీగా ఉంటుంది. సో.. ప్లీజ్ ట్రై ఇట్..!!