బాంబే కార్న్ స్పెషల్

FILE
కావలసిన పదార్థాలు :
కార్న్‌ఫ్లోర్... రెండు కప్పులు
పంచదార... రెండు కప్పులు
నెయ్యి... రెండు కప్పులు
బాదం, పిస్తా, జీడిపప్పులు... అన్నీ కలిపి ఒక కప్పు

తయారీ విధానం :
అడుగు మందంగా ఉండే పాత్రలో పంచదార లేతపాకం పట్టి, సగం పాకాన్ని విడిగా మరో పాత్రలోకి తీయాలి. మిగిలిన పాకంలో కార్న్‌ఫ్లోర్ వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని అలాగే పదినిమిషాలపాటు సన్నటిమంటపై కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉడికించాలి.

తరువాత పక్కన తీసిపెట్టిన పాకాన్ని కూడా పోసి ఎక్కువ మంటమీద ఉడికిస్తూ, వేగంగా కలిపి ఒక నిమిషం తరువాత స్టౌ మీది నుంచి దించేయాలి. ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోయాలి. చల్లారిన తరువాత కావాల్సిన సైజులో ముక్కలుగా కోసి నిల్వ ఉంచుకోవచ్చు. అంతే... పిల్లలకు చాలా ఇష్టమైన బాంబే కార్న్ స్పెషల్ రెడీ..! ఇది మూడు వారాలకు పైబడే నిల్వ ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి