కావలసిన పదార్థాలు : పచ్చి బియ్యంపిండి... 4 కప్పులు ఎసరునీరు... 2 లీ. చిక్కగా మరిగించిన పాలు... ఒక లీ. బెల్లంతురుము... ఒక కిలో సగ్గుబియ్యం... వంద గ్రా. నెయ్యి... వంద గ్రా. జీడిపప్పు... 75 గ్రా. యాలకుల పొడి... ఒక టీ. పచ్చకర్పూరం... కాస్తంత మిఠాయి రంగు.. చిటికెడు
తయారీ విధానం : గుప్పెడు బెల్లం తురుము విడిగా ఉంచి మిగిలిన బెల్లంలో మూడు వంతుల యాలకులపొడి, పచ్చకర్పూరం, కేసరి కలర్ వేసి కొంచెం నీళ్లు పోసి తీగపాకం పట్టి ఉంచాలి. బియ్యప్పిండిలో మిగిలిన యాలకులపొడి, బెల్లం తురుము, సగం నెయ్యి, జీడిపప్పు పొడి, తగినన్ని పాలు పోసి బాగా కలిపి గట్టి ముద్ద చేసి ఉంచాలి.
జీడిపప్పును నేతిలో దోరగా వేయించి ఉంచాలి. కుక్కర్‌లో ఎసరునీరు పోసి మరిగించాలి. అందులోకి బియ్యప్పిండి మిశ్రమ ముద్దను వేసి, చక్కిడాల గిద్దలో ఉంచి వత్తాలి. ఇదే కుక్కర్‌లో సగ్గుబియ్యం కడిగి పోసి, మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించి మూత తీసి పాకం పోసి జీడిపప్పు వేసి నెయ్యి పోసి కలపాలి. చివరగా పాలు పోసి మళ్లీ కలిపి మూతపెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే కమ్మని రుచిగల పాలతాలికలు రెడీ..!