బరుగు తగ్గాలనుకుంటే? ఈ బ్రెడ్ రెసిపీ తిని చూడండి.....

గురువారం, 5 జులై 2018 (12:57 IST)
బ్రెడ్‌లో వాడేది ముడి గింజలు కనుక వాటికి ఆ రంగు వస్తుంది. ముడిగింజలలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముడి గింజలలో ప్రతి దానికి పైన తవుడు పొర ఉంటుంది. ఈ కారణంగానే బ్రెడ్‌ను ఆరోగ్యకరమంటారు. దీనిలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. బ్రెడ్ తేలికగా జీర్ణం అవుతుంది. డైటింగ్ చేసేవారు దీనిని తినేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కొవ్వు కలిగించదు. కనుక బ్రెడ్ తిని ఆరోగ్యంగా, సన్నగా, నాజూకుగా ఉండవచ్చు. మరి దీనితో ఒక రుచికరమైన వంటకం మీ కోసం...
 
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైస్స్ - 8
పచ్చి కొబ్బరి తురుము - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్న ముక్క
కిస్‌మిస్ - 3 స్పూన్స్
జీడిపప్పు - 2 స్పూన్స్
మిరియాలపొడి - 1/2 స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా కొబ్బరి తురుములో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కిస్‌మిస్, జీడిపప్పు, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచులు తీసేయాలి. బ్రెడ్ స్లైసులను నీళ్లలో ముంచి తీసి అరచేతిలో అదిమి నీరంతా పిండేయాలి. ఆ స్లైసస్ మధ్యలో చెంచాడు కొబ్బరి మిశ్రమం పెట్టి అన్ని వైపులనుండి మూసివేయాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసులలో కొబ్బరి తురుమును పెట్టుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనెను వేసి బాగా వేడయ్యాక ఆ బ్రెడ్ బాల్స్‌ వేసి బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే బ్రెడ్ కోకోనట్ బాల్స్ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు