థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకుపోయిన 12మంది చిన్నారులు... (వీడియో)

మంగళవారం, 3 జులై 2018 (16:02 IST)
థాయ్‌లాండ్‌లో ట్రెక్కింగ్ శిక్షణ కోసం వెళ్లిన 12 మంది చిన్నారులు గుహలోకి చిక్కుకుపోయారు. తొమ్మిదిరోజుల పాటు గుహలోనే గడిపారు. పదో రోజున వారి ఆచూకీ తెలియవచ్చింది. ఓ లోతైన గుహలో చిక్కుకుపోయి బయటకు రాలేక అక్కడే గడుపుతున్న థాయ్ యూత్ ఫుట్ బాల్ టీమ్‌లోని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నట్టు తెలియజేస్తూ ఓ వీడియో విడుదలైంది. 
 
ఓ గుహలో మట్టి, బురదనీరు మధ్య వీరంతా చిక్కుకుపోయి, ఆకలితో అలమటిస్తున్నారు. తమకు కనీస ఆహారం పంపాలని వేడుకున్నారు. థాయ్ నేవీ సీల్స్ విడుదల చేసిన ఈ వీడియోలో ఫుట్ బాల్ జర్సీలు ధరించిన వీరంతా మోకాళ్లపై కూర్చుని.. ఆకలిబాధతో పాటు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోమవారం నాడు తీశామని చెబుతూ నేవీ సీల్స్ తన ఫేస్ బుక్ అధికార పేజీలో వీడియోను పోస్ట్ చేసింది.
 
ఈ వీడియోలో గుహలోకి వెళ్లిన డైవర్, బ్రిటిష్ ఇంగ్లీష్ యాసతో మాట్లాడుతూ, మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడకు చాలామంది రానున్నారని, తొలుత తాను వచ్చానని, అందరినీ బయటకు తీసుకెళ్తామని చెప్పాడు. జూన్ 23, శనివారం నుంచి వీరంతా గుహలో చిక్కుకుపోయి ఉన్నారని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు