కొబ్బరి ముక్కలు : అర కప్పు
యాలకుల పొడి : అర టీ స్పూన్
గసగసాలు : ఒక టేబుల్‌స్పూన్
ముందుగా బియ్యాన్ని కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు వడపోసి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి పొడి కొట్టాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి పోసి జీడిపప్పు, కొబ్బరి ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే గసగసాలను వేయించాలి. యాలకులను గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. చిక్కగా అయ్యాక కొద్దిగా నెయ్యి పోసి యాలకులపొడి, బియ్యం పిండి మెల్లగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. సన్నని మంట మీద కాసేపు ఉంచి గసగసాలు, వేయించుకున్న కొబ్బరి, జీడిపప్పులను వేసి కలపాలి.