తయారీ విధానం: బాగా పండిన మామిడి పండును శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి. వీటిని మిక్సీలోకి తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన పొట్టు తీసేసిన బాదం పప్పు, నాలుగైదు చెంచాల తేనె వేసి మిక్సీ పట్టాలి. తర్వాత పెరుగు, ఐసు ముక్కలు వేసుకుని మరోసారి మిక్సీ పడితే సరిపోతుంది. పోషకాలను ఇచ్చే చల్లని మ్యాంగో స్వీటీ రెడీ.