డబుల్‌ కా మీఠా తయారీ విధానం.....

గురువారం, 28 జూన్ 2018 (15:26 IST)
పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బడి నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏదో ఒకటి కావాలని మారాం చేస్తుంటారు. అలాంటివారి కోసం ఏదో ఒక రుచికరమైన పదార్థం చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు డబుల్ కా మీఠా అనే పదార్థం ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
తెల్ల బ్రెడ్‌ స్లైజస్ - 8
పాలు - 1 కప్పు
పంచదార - 3 స్పూన్స్
మీగడ - 3 స్పూన్స్
నెయ్యి - 2 స్పూన్స్
నానబెట్టి, తొక్కతీసి, తరిగిన బాదం - 12
తరిగిన పిస్తా - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
 
తయారీ విధానం:
ముందుగా పాలను మందపాటి గిన్నెలో మరిగించాలి. మరో గిన్నెలో పంచదార, రెండు స్పూన్ల నీళ్లు వేసి పాకం పట్టాలి. ఇప్పుడు బ్రెడ్‌ స్లయిస్‌లను అంచులు కట్‌ చేసి త్రికోణాకారంలో కత్తిరించుకోవాలి. వీటిని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. పాలు మరిగాక మీగడ వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి. వేయించిన బ్రెడ్‌ ముక్కలను చక్కెర పాకంలో ముంచి తీసి మరో వెడల్పాటి గిన్నెలో పరుచుకోవాలి. వాటి పైన చిక్కటి పాలను పోసి మిగిలిన చక్కెర పాకం పోయాలి. తరిగిన బాదం పప్పులు చల్చి పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచాలి. 10 నిమిషాల్లో నెయ్యి పైకి తేలుతూ డబుల్‌ కా మీఠా నోరూరించేలా తయారవుతుంది. అప్పుడు కుంకుమ పువ్వు చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి. అంతే డబుల్ కా మీఠా రెడీ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు