మెంతులలో లడ్డూలా.. ఎలా చేయాలో చూద్దాం...

గురువారం, 25 అక్టోబరు 2018 (11:24 IST)
మెంతులు అజీర్తిని తగ్గిస్తాయి. మెంతుల మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య ఉండదు. దాంతో జుట్టు రాలకుండా ఉంటుంది. మెంతులతో రకరకాల వంటలు చేస్తుంటారు.. కానీ ఎప్పుడైనా లడ్డూలు తయారుచేసున్నారా.. మరి ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
మెంతులు - 1 కప్పు
పాలు - అరలీటరు
గోధుమపిండి - 300 గ్రాములు
నెయ్యి - 250 గ్రాములు
శొంఠి - 2 స్పూన్స్
బాదం - అరకప్పు
మిరియాలు - కొన్ని
జీలకర్ర పొడి - 2 స్పూన్స్
ఇలాయిచీ - 10
దాల్చిన చెక్క - 4
జాజికాయలు - 2
చక్కెర - 300 గ్రాములు
 
తయారీ విధానం:
ముందుగా మెంతులను బాగా కడిగి ఒక బట్టలో కట్టాలి. ఆ తరువాత నీళ్ళు పోయేంతవరకు ఎండలో ఉంచాలి. తరువాత కాసేపు ఆరబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి. మెత్తగా కాకుండా పొడిలా ఉండేలా పట్టాలి. ఇప్పుడు పాలు వేసిచేసుకుని చల్లార్చాలి. ఈ పాలలో మెంతుల పొడి పోసి ముద్దల్లా కలుపుకోవాలి. ఇలా చేసిన వాటిని 8 గంటల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత మిరియాలు, దాల్చినచెక్క, జాజికాయలను పొడి చేయాలి.
 
ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి పాలలో నానబెట్టిన మెంతుల పిండిని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నెయ్యి వేసి అందులో చక్కెర, జీలకర్ర పొడి, శొంఠి, బాదం పప్పులు, ఇలాయిచీ, మిరియాలతో చేసిన పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం పాకంలా వస్తుంది. అప్పటి వరకు అలానే ఉంచాలి. ఆ తరువాత ముందుగా తయారుచేసుకున్న మెంతుల మిశ్రమాన్ని ఆ పాకంలో వేసి కలుపుకుని చల్లారాక నిమ్మకాయ సైజుల్లో లడ్డూలను చేసుకోవాలి. అంతే... మెంతులు లడ్డూలు రెడీ.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు