బిర్యానీతో వడ్డించే బ్రెడ్ హల్వాకు తక్కువేం కాదు.. రస్క్ హల్వా తయారీ ఇదో..

బుధవారం, 15 జూన్ 2022 (19:26 IST)
Bread Halwa
బిర్యానీతో వడ్డించే బ్రెడ్ హల్వాను పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అలాగే రస్క్ హల్వా గురించి విన్నారా.. అయితే చదవండి మరి.. బ్రెడ్ హల్వా తరహాలో రస్క్ హల్వాను కూడా ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో సింపుల్‌గా చూద్దాం.. 
 
రస్క్ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు: రస్క్ - 200 గ్రా, పాలు - 300 మి.లీ, పంచదార - 1/4 కిలో, నెయ్యి - 1/2 కప్పు, జీడిపప్పు - 50 గ్రా, యాలకుల పొడి - 1/2 టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, ఫుడ్ కలర్ - కావలసినంత.
 
రస్క్ హల్వా రెసిపీ: ముందుగా స్టవ్ వెలిగించి అందులో 300 మిల్లీలీటర్ల పాలను మరిగించుకోవాలి. మరిగించిన పాలలో 200 గ్రాముల రస్క్ ముక్కలను కలపాలి. తరువాత స్టవ్‌ను తక్కువ మంట మీద పెట్టి కలుపుతూ వుంచాలి.
 
రస్క్ బాగా ఉడికిన తర్వాత పావు కిలో పంచదార వేసి కరిగించాలి. 200 గ్రాముల రస్క్‌కు పావు కిలో చక్కెర సరిపోతుంది. ఒకవేళ మీరు తక్కువగా జోడిస్తున్నట్లయితే, దానికి అనుగుణంగా చక్కెరను జోడించండి. అన్నింటినీ బాగా కలిపిన తరువాత చిటికెడు ఉప్పు కలపాలి.  
 
ఏదైనా డెజర్ట్‌లకు చిటికెడు ఉప్పును జోడించడం వల్ల తీపి రుచిని పెంచుతుంది. ఆపై నెయ్యిని కలపండి. 
 
నెయ్యితో రస్క్ ముక్కలను బాగా మరిగించి హల్వా పాకానికి రావాలి. సన్నని సెగపై హల్వాలా తయారయ్యాక అందులో అర టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అంతే రస్క్ హల్వా రెడీ. ఇందులో కాస్త నట్స్ పలుకులు జత చేసి కాస్త చల్లారాక సర్వ్ చేస్తే టేస్టే అదిరిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు