శ్రీరెడ్డి భీమవరం కుండ బిర్యానీ, బాగానే గిడుతున్నట్టుంది

శుక్రవారం, 27 మే 2022 (18:54 IST)
శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో తన ఫోకస్ అంతా వంటలపై పెట్టేసింది. యూ ట్యూబ్ ఛానల్లో ఓ ఊపు ఊపేస్తుంది. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా నాన్ వెజ్ ఐటెమ్స్ చేస్తూ పల్లెటూర్లలో హల్చల్ చేస్తోంది. తను భీమవరం కుండ బిర్యానీ స్పెషల్ గా చేస్తూ వండే విధానాన్ని వీడియో తీసి పెట్టింది.

 
ఈ సందర్భంగా శ్రీరెడ్డి చెపుతూ... మర్చిపోతున్న రుచులు గుర్తు చేస్తున్నా. రుచంటే రుచే మరి. బిర్యాని గురించే నేను చెప్పేది. అనవసరంగా తప్పర్దాలు తీసుకోవద్దు. అన్నీ దంచుకున్న మసాలాలే. మటన్ బిర్యానీ. ఎండకి నా రంగంతా పోయి నలుపు రంగు పడింది.

 
ఇపుడు వేటమాంసంతో భీమవరం బిర్యానీ చేస్తున్నా. పాత్రలో వేటమాసం వేయండి. నిమ్మకాయ పిండండి. ఉప్పు వేయండి. కొంచెం పసుపు వేయండి. కలిపేయండి. కొంచెం నూనె వేసి కలిపేద్దాం. పచ్చిమిరపకాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. వేపేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా. గుప్పెడు జీడిపప్పులు, పెరుగు, నెయ్యి కొద్దిగా, గరం మసాలా వేసాను. కుంకుమ పువ్వు వేసి పాలు కాసాను, అది కూడా వేసి కలిపేస్తున్నా.

వాసన అదిరిపోతుంది, బాగా కలుపుకోవాలి. కారం ఆఖరులో వేస్తా. మూకుడు పెట్టి కాస్త ఎక్కువ నూనె వేసుకుంటా. లవంగాలు, దాల్చిన చెక్క, సజీరా, పలావుపువ్వు, యాలుక్కాయలు, బాణలిలో వేసి ఉడకబెట్టాలి. మూతపెట్టాలి. కారం వేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా. బిర్యానీ కోసం పాత్ర పెట్టి అందులో కాస్త ఉప్పు, నెయ్యి, పలావు పూవు, లవంగాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయరసం, జీడిపప్పు వేయాలి.

 
కాస్త మరిగాక... కిలో బియ్యం అరగంట నానబెట్టి వేయాలి. సగం ఉడికించి... నీరు ఒంపేయాలి. ఆ తర్వాత పాత్రలో నీరు పోసి.. కుండను పెట్టి లోపల కాస్త నూనె రాయాలి. అందులో మటన్ వేయాలి. ఫిల్టర్ చేసిన అన్నం వేయాలి. కొత్తిమీర, పుదీనా, వేయించుకుని తెచ్చుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఆ తర్వాత మూత పెట్టాలి. కుండకీ మూతకి గ్యాప్ లేకుండా చపాతీ పిండి పెట్టాలి. బాగా ఉడికాక దించేసి రైస్-మటన్ కలియబెట్టి తింటే టేస్ట్ అదిరిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది.
శ్రీరెడ్డి భీమవరం కుండ బిర్యానీ ఎలా చేస్తుందో చూడండి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు