సోయా బాసుంది ఎలా చేయాలో చూద్దాం..

గురువారం, 11 జూన్ 2015 (19:23 IST)
సోయా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్ర సంబంధిత వ్యాధులను అరికడుతుంది. క్రీడాకారులకు సోయా ఆహారం బలవర్ధకం, శక్తిదాయకం. సోయా ఆహారంలో వున్న ఫ్యాటి యాసిడ్స్, రక్త ప్రసరణను, మెనోపాజ్ సమస్యలను క్రమబద్ధీకరిస్తుంది. అలాంటి సోయాతో హెల్దీ బాసుంది ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు :
సోయా ఫ్లేక్స్ - వంద గ్రాములు 
పాలు - 1 లీటరు .
చక్కెర - వంద గ్రాములు  
మిల్క్ మెయిడ్ - రెండు టీ స్పూన్లు 
యాలకుల పొడి - ఒక టీ స్పూన్ 
బాదం, కిస్ మిస్, జీడిపప్పు - వంద గ్రాములు 
 
తయారీ విధానం:
సోయా ఫ్లేక్స్‌ను సరిపడినన్ని నీళ్ళతో కలిపి ఐదు నిమిషాలు మరిగించి ఆపై నీటిని వడగట్టాలి. వేరొక గిన్నెలో పాలను మరిగించి పంచదార, యాలకులు, బాదం, కిస్ మిస్, జీడిపప్పు వరుసగా వేసి రెండు నిమిషాల తర్వాత ఫ్లేక్స్ వేసి కలపాలి. మిల్క్ మెయిడ్ వేసి కలిపి మరో అయిదు నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి. అంతే సోయా బాసుంతి రెడీ అయినట్లే.

వెబ్దునియా పై చదవండి