కావలసిన పదార్థాలు : తాజా బియ్యంపిండి... రెండు గ్లాసులు పంచదారపొడి... అర గ్లాసు అరటిపండ్ల గుజ్జు.. వంద గ్రా. చిక్కటి పచ్చిపాలు... అర గ్లాసు కరిగించిన నెయ్యి... 50 గ్రా. యాలకుల పొడి.. అర టీ. కొబ్బరితురుము... ఒక చిప్ప
తయారీ విధానం : బియ్యప్పిండిలో పంచదారపొడి, యాలకులపొడి, చిక్కటి పచ్చిపాలు, కొబ్బరితురుము వేసి బాగా కలపాలి. తరువాత అరటిపండ్ల గుజ్జు, నెయ్యి పోసి మృదువుగా తయారుచేసి పిండిని కావలసిన సైజులో ఉండలుగా చుట్టి, కుక్కరు గిన్నెలో ఉంచి 25 నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించాలి. అంతే అరటి కుడుములు సిద్ధమైనట్లే..!
రొటీన్ కుడుములకన్నా ఇవి పెడితే వినాయకుడే కాదు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి మిగిలితే మరునాడు నూనెలో వేయించి తీస్తే కరకరలాడుతూ బాగుంటాయి. నిల్వ ఉంటాయి కూడా. తీపి ఎక్కువగా ఇష్టపడేవారు అవసరమైతే ఇందులో మరికాస్త పంచదార వేసుకోవచ్చు.