ఆలూ బుగ్గలు బూరెలాయెనే...!

కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... ఒక కేజీ
పంచదార... రెండు కప్పులు
యాలకుల పొడి... ఒక టీ.
నూనె... సరిపడా
జీడిపప్పు... వంద గ్రా.
మైదా... రెండు కప్పులు
బియ్యంపిండి... రెండు కప్పులు
వంటసోడా... పావు టీ.
పచ్చికొబ్బరికోరు... ఒక కప్పు
నెయ్యి... నాలుగు టీ.

తయారీ విధానం :
ముందు మైదా, బియ్యప్పిండి, వంటసోడా కలిపి నీళ్లు పోసి జారుగా కలిపి, కనీసం రెండు గంటలు నానబెట్టాలి. బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి, చేత్తో మెత్తగా మెదిపి ఓ పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పంచదార, అరగ్లాసు నీరు పోసి స్టవ్‌మీద పెట్టి కలుపుతూ ఉండాలి. పాకం ఉండకడుతుండగా కిందికి దించి బంగాళాదుంప ముద్ద, యాలకులపొడి, నేతిలో వేయించిన జీడిపప్పు వేసి కలిపి చల్లార్చాలి.

తరువాత నిమ్మకాయ సైజులో ఉండలు చేసి ఉంచాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాగాక బంగాళాదుంప ఉండల్ని మైదాలో ముంచి ఒక్కొక్కటే నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకూ వేయించి తీయాలి. అంతే ఆలూ బూరెలు సిద్ధమైనట్లే...!! కావాలంటే మీరు కూడా ట్రై చేయండి మరి...!!

వెబ్దునియా పై చదవండి