కావలసిన పదార్థాలు : పండిన అరటిపండ్లు... 12 కొబ్బరిపాలు... ఒకటిన్నర కప్పు పంచదార... ఒక కప్పు బ్రౌన్ షుగర్... ఒక కప్పు ఉప్పు... కాస్తంత
తయారీ విధానం : తొక్క తీసిన అరటిపండ్లను కొబ్బరిపాలతో కలిపి మిక్సీలో వేసుకుని మెత్తటి గుజ్జులాగా తయారు చేసుకోవాలి. ఈ పదార్థాన్ని పాన్‌లో వేసి సన్నటి సెగమీద గరిటెతో అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. ఈ పదార్థం చిక్కబడిన తరువాత పంచదారను, బ్రౌన్ షుగర్‌ను, ఉప్పును కలిపి బాగా గట్టిపడేదాకా కలుపుతూ ఉడికించాలి.
చివరగా ఈ పదార్థాన్ని నెయ్యిరాసిన పళ్లెంలో బోర్లించి సమంగా పరచి, చల్లారిన తరువాత కావాల్సిన సైజులో ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే అరటిపండుతో తయారైన బర్ఫీలు సిద్ధమైనట్లే...!