కావలసిన పదార్థాలు : పాలు... అర లీ. నెయ్యి... 200 గ్రా. గోధుమపిండి... 8 టీ. పంచదార... 8 టీ. బాదం... 20 యాలకులపొడి... ఒక టీ. ఎండుద్రాక్ష... రెండు టీ.
తయారీ విధానం : బాణలిలో నెయ్యి వేసి అందులో ఎండుద్రాక్ష వేసి వేయించాలి. తరువాత అందులోనే గోధుమపిండి కూడా వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. ఇందులోనే పంచదార వేసి కరిగాక కాచిన వేడి పాలు పోయాలి. కాసేపు అలాగే ఉడికించాక చివర్లో యాలకుల పొడి చల్లి, బాదంతో అలంకరించి దించేసి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే వేడి వేడి మిల్క్ రబ్ సిద్ధమైనట్లే...!