చనా పౌడర్ స్పెషల్ "బేసన్ బర్ఫీ"

కావలసిన పదార్థాలు :
శెనగపిండి... ఒక కేజీ
కోవా... అర కేజీ
పంచదార... ఒకటిన్నర కేజీ
యాలకులు... పది గ్రా.
జీడిపప్పు... రెండు టీ.
నెయ్యి... 200 గ్రా.

తయారీ విధానం :
శెనగపిండిలో నెయ్యి కలిపి దోరగా వేయించాలి. పంచదారను పాకంపట్టి, తీగపాకం రాగానే వేయించిన శెనగపిండిని, కోవాను వేసి కలియదిప్పాలి. మంట తగ్గించి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం గట్టిపడుతుండగా యాలకులపొడిని కూడా దానికి కలపాలి.

ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి.. పైన జీడిపప్పులను అద్దాలి. ఇష్టమైనవారు తగరపు రేకులను కూడా అంటించవచ్చు. ఇది ఆరిన తరువాత కావాల్సిన సైజులో ముక్కలుగా చేసి సర్వ్ చేయాలి. అంతే బేసన్ బర్ఫీ తయారైనట్లే...!

వెబ్దునియా పై చదవండి