కావలసిన పదార్థాలు : రాగిపిండి... అర కేజీ నువ్వులు... వంద గ్రా. వేరుశెనగపప్పు.... వంద గ్రా. బెల్లం... అర కేజీ నెయ్యి... 150 గ్రా.
తయారీ విధానం : ఓ బాణలిలో నెయ్యి వేసి రాగిపిండి కూడా వేసి బాగా కలిపి దోరగా వేయించాలి. మరో బాణలిలో వేరుశెనగపప్పు, నువ్వులు కూడా విడివిడిగా వేయించి పొడిచేసి ఉంచాలి. బెల్లం సన్నగా తురిమి ఉంచుకోవాలి.
ఇప్పుడు ఒక పాత్రలో రాగిపిండి, వేరుశెనగప్పుల పిండి, బెల్లం తురుములను వేసి మెత్తగా కలిపి ఉండలుగా చుట్టి... రెండు గంటలపాటు గాలిలో ఆరబెట్టి తరువాత సర్వ్ చేయాలి. అంతే రుచికి రుచీ... ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే రాగి లడ్డూలు తయారైనట్లే...!