పాలతో పసందైన "క్షీర్‌ ఖొర్మా"

FILE
కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీ.
సన్న సేమియా.. 150 గ్రా.
నెయ్యి.. 50 గ్రా.
యాలకులపొడి.. పావు టీ.
ఖర్జూరం ముక్కలు.. ఒకటిన్నర టీ.
జీడిపప్పు.. 50 గ్రా.
సారపప్పు.. ఒక టీ.
పంచదార.. 300 గ్రా.

తయారీ విధానం :
బాణలిలో నెయ్యి వేసి సన్న సేమియాను ఎర్రగా వేయించి, తీసి పక్కన ఉంచాలి. మళ్లీ అందులోనే తరిగిన జీడిపప్పు, ఖర్జూరం, సారపప్పుల్ని కూడా నేతిలో వేయించి పక్కన పెట్టాలి. పాలను మరిగించి దించాలి. ఇప్పుడు పాలల్లో వేయించిన సేమియా, పప్పులూ వేసి పది నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. తరువాత మెల్లగా కలియబెట్టాలి. సేమియా ఉడికిన తరువాత పంచదార వేసి, కలిపి వడ్డించండి. అంతే వేడి వేడి క్షీర్‌ ఖొర్మా రెడీ...!

వెబ్దునియా పై చదవండి