"బెల్లం అప్పాలు" కావాలా నాన్నా...!!

FILE
కావలసిన పదార్థాలు :
శెనగపిండి... నాలుగు కప్పులు
మంచినీరు... తగినంత
నూనె... సరిపడా
బియ్యంపిండి... రెండు కప్పులు
బొంబాయి రవ్వ... రెండు కప్పులు
బెల్లం తురుము... మూడు కప్పులు
యాలకుల పొడి... రెండు టీ.
వంటసోడా... అర టీ.

తయారీ విధానం :
శెనగపిండిలో బియ్యప్పిండి, బొంబాయిరవ్వ, బెల్లం తురుము, యాలకులపొడి, బేకింగ్‌పౌడర్‌ వేసి సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి. పెనంమీద కొద్దిగా నూనె రాసి చిన్న గుంటగరిటెతో పిండిని తీసి ఒకే సైజులో చిన్న చిన్న దోసెల్లాగా పోస్తూ.. కొద్దికొద్దిగా నూనె లేదా నెయ్యి వేస్తూ సన్నటి సెగమీద ఉంచాలి. వెడల్పాటి గిన్నెను మూతలా బోర్లించి ఓ నిమిషం ఉంచి తీయాలి. తరువాత వాటిని రెండువైపులా దోరగా, ఎర్రగా కాల్చి తీస్తే బెల్లం అప్పాలు రెడీ అయినట్లే..!

వెబ్దునియా పై చదవండి