బొంబాయి రవ్వతో "పూర్ణం బొబ్బట్లు"

కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ... రెండు కప్పులు
పంచదార... మూడు కప్పులు
మైదా... మూడు కప్పులు
సోడా... చిటికెడు
గోధుమపిండి... ఒక కప్పు
నెయ్యి... నాలుగు టీ.
నూనె లేదా నెయ్యి... ఒక కప్పు

తయారీ విధానం :
మైదా, గోధుమపిండిలను కలపాలి. దాంట్లో తగినన్ని నీళ్లుపోసి, వంటసోడా వేసి పూరీపిండిలాగా కలిపి మూతపెట్టి ఉంచాలి. ఓ బాణలిలో నెయ్యివేసి బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించుకోవాలి. అడుగు మందంగా ఉండే ఓ గిన్నెలో మూడు కప్పుల నీటిని పోసి స్టవ్‌పై పెట్టాలి.

నీరు మరుగుతుండగా వేయించిన రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికాక దాంట్లో పంచదార, యాలకులపొడి వేసి కలియబెట్టాలి. ఇది పూర్ణం చేసేందుకు అనువుగా తయారైన తరువాత దించేసి నిమ్మకాయంత సైజులో ఉండలు చేసుకోవాలి.

ఇప్పుడు మైదాపిండిని చిన్న సైజు పూరీల్లాగా వత్తి, వాటి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి మూసివేసి, దాన్ని మళ్లీ అప్పడాల కర్రతో లేదా చేత్తో బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. వీటిని పెనంపై నూనె లేదా నెయ్యివేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి రవ్వ బొబ్బట్లు రెడీ సిద్ధమైనట్లే...!

వెబ్దునియా పై చదవండి