రసగుల్లా స్వీట్

FILE
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటర్
పంచదార... 3 కప్పులు
మైదాపిండి... పిడికెడు
వడకట్టేందుకు మంచి క్లాత్... చిన్న నాప్‌కిన్ సైజులో

తయారీ విధానం :
ముందుగా పాలని మరిగించి రెండు చుక్కలు నిమ్మరసం పిండితే పాలు విరిగి పోతాయి. ఆ విరిగిన పాలని మంచి క్లాత్‌లో వడకట్టాలి. అప్పుడు గట్టిగా తయారై, పనీర్ అవుతుంది. ఈపనీర్‌లో పిడికెడు మైదా పిండివేసి బాగా మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఆరిపోకుండా తడిబట్టను కప్పి ఉంచాలి.

పంచదారలో తగినన్ని నీళ్లుపోసి పాకం తయారు చేసి, పాకం బాగా ఉడుకుతుండగా పై ఉండలను వేసి తీసేయాలి. ఉండలలోకి పాకం బాగా పట్టి, మిశ్రమం బాగా ఆరిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే తియ్యతియ్యని రసగుల్లా స్వీట్ తయారైనట్లే...!

వెబ్దునియా పై చదవండి