కావలసిన పదార్థాలు : గోధుమపిండి.. నాలుగు కప్పులు బియ్యం పిండి.. రెండు కప్పులు కొబ్బరి తురుము.. రెండు కప్పులు సన్నటి రవ్వ.. ఒక కప్పు యాలకుల పొడి.. రెండు టీ. బెల్లం (జాగరీ).. ఒక కేజీ గసగసాలు, తెల్ల నువ్వులు.. అర కప్పు చొప్పు
తయారీ విధానం : ముందుగా బెల్లాన్ని మెత్తగా నలగ్గొట్టి, కాసిన్ని నీళ్లుపోసి కరిగించాలి. ఆ తరువాత గసగసాలు మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి, బెల్లం కరిగించిన నీటిని పోస్తూ చపాతీ పిండిలాగా బాగా కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి పక్కనుంచాలి. ఒక్కో ఉండను తీసుకుని ముందుగా కాస్త వెడల్పుగా ఒత్తి, గసగసాల్లో అద్దాలి. దాన్నే మళ్లీ మందపాటి చపాతీలా ఇంకాస్త పెద్దగా ఒత్తి, నూనె లేదా నెయ్యితో పెనంపై వేసి దోరగా కాల్చి తీయాలి.
అంతే కమ్మటి రుచులతో అలరించే జాగరీ రోటీ మకరంద్ తయారైనట్లే..! ఏదేని పొడి డబ్బాలో నిల్వచేస్తే పదిహేను రోజులదాకా నిల్వ ఉండే ఈ జాగరీ రోటీ మకరంద్‌లు వేసవి సెలవుల్లో పిల్లలకు మంచి స్నాక్స్‌గా ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచీ ఉండే వీటిని మీరూ ఓసారి ట్రై చేస్తారు కదూ..?!