కావలసిన పదార్థాలు : స్వీట్‌కార్న్ గింజలు.. వంద గ్రా. (పచ్చివి) పాలు.. అర లీ. కస్టర్డ్ పౌడర్.. రెండు టీ. పంచదార.. అర కప్పు యాలకుల పొడి.. అర టీ.
తయారీ విధానం : స్వీట్‌కార్న్ గింజల్ని ఉడికించి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పాలుపోసి వేడి చేయాలి. విడిగా ఓ చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి కస్టర్డ్ పొడి వేసి కలిపి దీన్ని పాలల్లో కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడగానే పంచదార కూడా కలిపి కరిగించాలి. తరువాత స్వీట్‌కార్న్ గింజల్ని కూడా వేసి చల్లార్చాలి. చివరగా యాలకులపొడి కలిపితే ముత్యాల పాయసం తయార్..! రుచికోసం జీడిపప్పు, కిస్మిస్లను నేతిలో వేయించి కలుపుకోవచ్చు.