స్వైన్‌ఫ్లూతో ఒకే వారంలో 7వందల మంది మృతి

శనివారం, 31 అక్టోబరు 2009 (11:04 IST)
FILE
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్వైన్‌ఫ్లూ మహమ్మారి వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒకే వారంలో దాదాపు 700 మంది మృత్యువాత పడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ మహమ్మారి వ్యాధి బారిన పడి ఒకే వారంలో 700 మంది మృత్యువాత పడ్డారని, ఈ సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5700కు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం వెల్లడించింది.

డబ్ల్యూహెచ్ఓ గత వారం విడుదల చేసిన వివరాలననుసరించి ఇప్పటి వరకు ఒక్క అమెరికాలో దేశంలోనే 4175 మంది హెచ్1ఎన్1 వైరస్ బారినపడ్డారు. వీరిలో అత్యధికులు అమెరికా వాసులు కావడం గమనార్హం.

ఇదిలావుండగా ప్రపంచవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి మృతుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ వైద్య నిపుణులతో సమావేశమై త్వరితగతిన ఓ టీకా మార్కెట్లోకి విడుదల చేయాలని సంకల్పించినట్లు సంస్థ తెలిపింది.

కాగా ఈ టీకాను సాధారణ ఫ్లూ వ్యాధికి కూడా ఉపయోగించేలా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సంస్థ నిపుణులకు సూచించింది.

వెబ్దునియా పై చదవండి