ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

డీవీ

శనివారం, 18 మే 2024 (10:18 IST)
veera shankar, harish shankar and team with Chief Minister Revanth Reddy
ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు సంఘం ఆహ్వానించింది. గత కొద్దిరోజులుగా ఎలక్షన్ హడావుడి వుండడంతో దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది.  పోలీసుల పర్మిషన్ ఇవ్వలేదని చివరి నిముషంలో ఎల్.బి. స్టేడియంలో జరగాల్సిన వేడుక పోస్ట్ పోన్ అయింది. ఎట్టకేలకు ఈ ఆదివారం ఈ వేడుకను జరపనున్నారు.
 
Ram Gopal Varma and team with Revanth Reddy
ఈ సందర్భంగా దాసరి గారి గురించి కొద్దిసేపు సి.ఎం. వారితో మాట్లాడారు.  ఆయన తీసిన సినిమాలు ఆలోచింపజేసేవిగా వుంటాయని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసిన సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు వున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు