ప్రమాణస్వీకారం అనంతరం సభికులకు సీఎం కేసీఆర్ వినమ్రంగా నమస్కారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్.. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.