రేపటి నుంచి రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం...(Video)

మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:23 IST)
కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో విజయం మహాకూటమిదే. ప్రజలందరూ మావైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకముంది. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తుంచుకునే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఇది నిజం అంటూ కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రకటించారు.
 
కాంగ్రెస్ పార్టీ నేతలందరూ పెద్ద ఎత్తున ప్రచారంలో మునిగితేలారు. పోలింగ్ తరువాత కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు నిరాశకు గురవుతున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చేశారట. రేపు కొడంగల్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చేశారట రేవంత్ రెడ్డి. 
 
అయితే కొంతమంది రేవంత్ సన్నిహితులు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారంట. రేవంత్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకూడదని భావిస్తున్నారట. రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆశక్తికరంగా మారుతోంది. ఎన్నికల ఫలితాల విశ్లేషణ వీడియో చూడండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు