వెట్టిచాకిరీ కేసు... టీ సీఎం కార్యాలయ కార్యదర్శ స్మితా సబర్వాల్‌కు వారెంట్

శనివారం, 6 డిశెంబరు 2014 (10:24 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్న స్మితా సభర్వాల్‌కు ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లె ఫస్ట్ క్లాస్ కోర్టు గురువారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 15లోగా ఆమె కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. 
 
గత 2003లో స్మితదాస్ మదనపల్లె సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు వహించారు. ఆ రోజుల్లో కొండామర్రిపల్లె సమీపంలో గాయిత్రీస్టోన్ క్రషర్స్‌లో 39 మంది కూలీలకు తక్కువ జీతం ఇస్తూ వారితో వెట్టిచాకిరీ చేయిస్తుండడంతో గుర్తించిన స్మితదాస్ యజమాన్యం క్రిష్ణమూర్తి, శ్రీనివాసులుపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వెట్టిచాకిరీ చేస్తున్న వారికి విముక్తి కల్పించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో వుంది.
 
కాగా 2009 నుంచి స్మితదాస్ కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో మదనపల్లె ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేశారు. స్మితాదాస్ 2003 నుంచి 2009 వరకు మదనపల్లె కోర్టుకు హాజరైన స్మితాదాస్‌, ఆ తరువాత నాలుగేళ్లుగా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఈనెల 15వ తేదీ లోపు తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆమెకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి